实况竞彩欧洲杯比赛日官方诚信唯一网站【官网:126615.icu】_po59B

సాంప్రదాయకంగా ఏడు ఖండాలు అని చెప్పుకొనేవాటిలో ఐరోపా ఒకటి. ఐరోపా భూఖండము యొక్క పశ్చిమాత్య ద్వీపకల్పము. ఐరోపాకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రమ…
సాంప్రదాయకంగా ఏడు ఖండాలు అని చెప్పుకొనేవాటిలో ఐరోపా ఒకటి. ఐరోపా భూఖండము యొక్క పశ్చిమాత్య ద్వీపకల్పము. ఐరోపాకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రము, ఆగ్నేయాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం, నల్లసముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతున్న కాలువలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు దిశన ఐరోపా, ఆసియా ఖండాలకు సరిహద్దులుగా ఉరల్ పర్వతాలు, ఉరల్ నది, కాస్పియన్ సముద్రం ఉన్నాయి. విస్తీర్ణాన్ని బట్టి ఐరోపా, 10,180,000 చదరపు కిలోమీటర్లు వైశాల్యముతో ప్రపంచములో రెండవ చిన్న ఖండము. ఇది 2% భూమి వైశాల్యము కలిగి ఉంది. ఐరోపా ఖండంలో దాదాపు 50 దాకా సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. కానీ వీటి కచ్చితమైన సంఖ్య ఐరోపా యొక్క సరిహద్దుల నిర్ణయాన్ని బట్టి, పూర్తిస్థాయి గుర్తింపులేని ప్రదేశాలను పరిగణనలోకి తీసుకోవటం, తీసుకోకపోవటం వంటి విషయాలపై ఆధారపడుతుంది. ఐరోపా దేశాలలో జనాభా వారిగా, వైశాల్యము వారీగా రష్యా అన్నింటికంటే పెద్దదేశం కాగా వాటికన్ అన్నింటికంటే చిన్నదేశం. 71 కోట్ల జనాభాతో ఆసియా, ఆఫ్రికాల తర్వాత ఐరోపా అత్యంత జనాభా కలిగిన ఖండము. ప్రపంచము యొక్క 11% ప్రజలు ఐరోపాలో నివసిస్తున్నారు. అయితే, ఖండము అంటే ఒక భౌగోళిక ఉనికితో పాటు, సాంస్కృతిక, రాజకీయ ఉనికిని కూడా సూచిస్తుంది కాబట్టి ఐరోపా యొక్క సరిహద్దులు, జనాభా గురించి ఏకాభిప్రాయము లేదు.
  • విస్తీర్ణం: 10,180,000 కి.మీ.² (3,930,000 చ.మై.)
  • జనాభా: 731,000,000
  • జనసాంద్రత: 70/కి.మీ.² (181/చ.మై.)
  • ప్రాంతీయత: ఐరోపా
  • భాషా కుటుంబాలు: ఇండో-ఐరోపా · Finno-Ugric · Altaic · Basque · Semitic · North Caucasian
  • పెద్ద నగరాలు: ఇస్తాంబుల్, మాస్కో, లండన్, పారిస్, మాడ్రిడ్, బార్సెలోనా, సెయింట్ పీటర్స్ బర్గ్, మిలాన్, బెర్లిన్, రోమ్, ఏథెన్స్, కీవ్, బుచారెస్ట్
  • టైం జోన్లు: UTC (ఐస్‌ల్యాండ్) నుండి UTC+5 (రష్యా) వరకు
దీనిలోని డేటా: te.wikipedia.org